Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డికి 101 గొర్రెలు కానుక
ABN , First Publish Date - 2022-12-16T12:28:10+05:30 IST
గంగావతి నగరంలో గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) నూతన గృహ ప్రవేశం చేసినందుకు, 12 ఏళ్లు అనంతరం తిరిగి రాజకీ
గంగావతి రూరల్(బెంగళూరు), డిసెంబరు 15: గంగావతి నగరంలో గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) నూతన గృహ ప్రవేశం చేసినందుకు, 12 ఏళ్లు అనంతరం తిరిగి రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా 101 గొర్రెలను త్వరలో కానుకగా ఇస్తున్నట్లు స్థానిక వాసి ఎమనూరప్ప ఉండేగౌడ తెలిపారు. వీటి ఖరీదు దాదాపు రూ. పది లక్షలు ఉంటుందన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి సింధనూరు లేదా గంగావతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శంభునాథ్, అనుమేష్ నాయక్, నాగరాజు బళ్లారి, మల్లేశప్ప, వీరేష్ పాల్గొన్నారు.