ఫ్రాన్స్‌ యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ABN , First Publish Date - 2022-09-19T07:11:18+05:30 IST

ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానం ‘ఎయిర్‌బస్‌ ఏ400ఎం అట్లాస్‌’ చెన్నై విమానాశ్రయంలో ఆదివారం అత్యవసరంగా దిగింది.

ఫ్రాన్స్‌ యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

చెన్నై, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానం ‘ఎయిర్‌బస్‌ ఏ400ఎం అట్లాస్‌’ చెన్నై విమానాశ్రయంలో ఆదివారం అత్యవసరంగా దిగింది. ఈ యుద్ధ విమానం గంటకు 880 కి.మీల వేగంతో ప్రయాణిస్తూ, ఆకాశంలో ఎగురుతూనే మరొక విమానానికి ఇంధనాన్ని అందించగలదు. దీనిలో హెలికాప్టర్లు, ట్యాంకర్లను తరలించే వీలుంది. ఆదివారం ఉదయం ఈ విమానం సింగపూర్‌ నుంచి అబుదాబీ వెళ్తుండగా, ఇంధనం నిల్వ బాగా తగ్గిపోయినట్టు పైలట్‌ గుర్తించారు. దీంతో చెన్నై విమానాశ్రయం కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించి ఇంధనం నింపుకొనేందుకు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతివ్వాలని కోరారు. కంట్రోల్‌ రూమ్‌ అధికారులు ఓకే చెప్పడంతో యుద్ధ విమానం అత్యవసరంగా చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఇంధనం నింపుకొన్నాక అబుదాబీకి బయల్దేరి వెళ్లింది.

Updated Date - 2022-09-19T07:11:18+05:30 IST