40 శాతం జడ్జి పోస్టుల ఖాళీ !

ABN , First Publish Date - 2022-07-05T13:39:31+05:30 IST

చెన్నై పరిధిలోని కోర్టుల్లో 40 శాతం జడ్జి పోస్టులు ఖాళీగా వున్నాయి. దీంతో కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అత్యవసర కేసుల విచారణలోనూ జాప్యం

40 శాతం జడ్జి పోస్టుల ఖాళీ !

- చెన్నై కోర్టులకు న్యాయమూర్తులు అవసరం 

- కేసుల విచారణల్లో తీవ్ర జాప్యం


ప్యారీస్‌, జూలై 4: చెన్నై పరిధిలోని కోర్టుల్లో 40 శాతం జడ్జి పోస్టులు ఖాళీగా వున్నాయి. దీంతో  కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అత్యవసర కేసుల విచారణలోనూ జాప్యం జరుగుతోంది. మద్రాసు హైకోర్టులో ఇటీవల 28 మంది న్యాయమూర్తులను నియమించగా, ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, కోర్టు కార్యాలయాల్లో 81 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులతో కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని న్యాయవాదుల సంఘాలు వాపోతున్నాయి. న్యాయమూర్తులు లేకపోవడంతో మోటారు వాహన కేసులు సహా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రమాదాల్లో పరిహారం కోరుతూ పిటిషన్లు వేసిన బాధితులు దీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని కేసులు తాత్కాలిక కోర్టుల్లో చేపడుతుండగా, అక్కడ రోజుకు 30 కేసులు మాత్రమే విచారిస్తున్నారు. దీంతో, పనిభారం అధికమై ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఖాళీ పోస్టులు సత్వరం భర్తీచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని న్యాయవాదుల సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Read more