Former Minister: వారిద్దరిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు
ABN , First Publish Date - 2022-08-17T16:03:52+05:30 IST
పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే పటిష్ఠంగానే ఉందని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా పార్టీ

- ఓపీఎస్ వెంట నేతలెవరూ లేరు
- మాజీ మంత్రి జయకుమార్
చెన్నై, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే పటిష్ఠంగానే ఉందని, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా పార్టీ చెక్కుచెదరదని మాజీ మంత్రి డి. జయకుమార్(Former Minister D. Jayakumar) ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పల్లవన్ హౌస్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం అన్నా కార్మికవర్గం సభ్యుల నిరాహార దీక్ష మంగళవారం జరిగింది. ఈ దీక్షా శిబిరంలో ఆయన ప్రసంగిస్తూ శశికళ, దినకరన్(Sasikala, Dinakaran)లను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, వారిని చేర్చుకోవాల్సిన అగత్యం పార్టీకి పట్టలేదని స్పష్టం చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వెంట పార్టీ నాయకులు ఎవరూలేరని పదుల సంఖ్యలో మాజీ నేతలను వెంటబెట్టుకుని అన్నాడీఎంకేను కైవశం చేసుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఈ దీక్షా శిబిరంలో మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, ఆర్బీ ఉదయకుమార్, గోకుల ఇందిరా, మాధవరం మూర్తి తదితరులు పాల్గొన్నారు.