5 రష్యన్ యుద్ధ విమానాలు,ఒక హెలికాప్టరును కూల్చివేశాం...ఉక్రెయిన్ మిలటరీ ప్రకటన

ABN , First Publish Date - 2022-02-24T17:41:21+05:30 IST

రష్యాతో గురువారం జరుగుతున్న యుద్ధంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టరును కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది...

5 రష్యన్ యుద్ధ విమానాలు,ఒక హెలికాప్టరును కూల్చివేశాం...ఉక్రెయిన్ మిలటరీ ప్రకటన

ఉక్రెయిన్ : రష్యాతో గురువారం జరుగుతున్న యుద్ధంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టరును కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలటరీ ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతంలో ఐదు రష్యన్ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఆ దేశ మిలటరీ గురువారం తెలిపింది. ఈ వారం ప్రారంభంలో రష్యా గుర్తించిన ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లో లుహాన్స్క్ ఒకటి. ఉక్రెయిన్ దేశంపై తాము సైనిక చర్య ప్రారంభించినట్లు రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించగానే పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది.అత్యవసర ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఉక్రెయిన్ ప్రతినిధి ‘‘యుద్ధాన్ని ఆపండి’’ అని అందరికీ విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా, పుతిన్ దండయాత్ర క్రమాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఖండించారు. రష్యా దూకుడుకు ప్రతిస్పందించడానికి నాటో మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటామని జో బిడెన్ చెప్పారు.


Read more