బతికి వస్తామనుకోలేదు..

ABN , First Publish Date - 2022-03-05T17:32:18+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన బళ్లారి విద్యార్థులు నలుగురు, విజయనగం జిల్లా విద్యార్థి ఒకరు మొత్తం ఐదుగురు వైద్య విద్యార్థులు స్వస్థలానికి శుక్రవారం చేరుకున్నారు. బళ్లారికి చెందిన తయాబ్‌ కౌసర్‌, సభా

బతికి వస్తామనుకోలేదు..

                      - బళ్లారి చేరిన ఐదుగురు వైద్య విద్యార్థులు


బళ్లారి(కర్ణాటక): ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన బళ్లారి విద్యార్థులు నలుగురు, విజయనగం జిల్లా విద్యార్థి ఒకరు మొత్తం  ఐదుగురు వైద్య విద్యార్థులు స్వస్థలానికి శుక్రవారం చేరుకున్నారు. బళ్లారికి చెందిన తయాబ్‌ కౌసర్‌, సభా కౌసర్‌ సోదరీమణులు మాట్లాడుతూ తాము బతికి తిరిగి వస్తామా అని నమ్మకం కూడా లేదన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ద వాతావరణంతో చీకట్లు కమ్ముకున్నాయన్నారు. నగరంలోని మాజీ సైనికుడి కుమార్తెలు, సోదరుడు షకీబ్‌ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మెడిసన్‌ చేయడానికి వెళ్లారు. యుద్దం మొదటి మూడు రోజులు పరిస్థితి బాగానే ఉందని, 4,5 రోజుల్లో చాలా భయపడ్డామన్నారు. ఆహారం ఉన్నప్పటికి బయటకు వెళ్లలేక బంకర్‌, రైల్వేస్టేషన్‌లో ఆశ్రయం పొందామన్నారు. తాము బంకర్‌లో ఉన్నప్పుడు కూడా నిరంతరం బాంబుల దాడి జరిగిందన్నారు. మిగిలిన విద్యార్థులను కూడా త్వరగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read more