Rains: ఐదు జిల్లాలకు వర్షసూచన
ABN , First Publish Date - 2022-08-17T14:19:46+05:30 IST
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో పర్వతశ్రేణులు అధికంగా ఉన్న ఐదు జిల్లాల్లో ఈ నెల 19వ తేది వరకు భారీవర్షాలు(heavy

ప్యారీస్(చెన్నై), ఆగస్టు 16: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో పర్వతశ్రేణులు అధికంగా ఉన్న ఐదు జిల్లాల్లో ఈ నెల 19వ తేది వరకు భారీవర్షాలు(heavy rains) కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నుంగంబాక్కంలోని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, నీలగిరి, కోయంబత్తూర్(Coimbatore), ఈరోడ్, సేలం, ధర్మపురి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలోని కొన్ని జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. కాగా, 18,19 తేదీల్లో కృష్ణగిరి, కళ్లకుర్చి, కడలూరు, మైలాడుదురై, పుదుకోట, తంజావూరు(Thanjavur), తిరువారూర్, నాగపట్టణం, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, నామక్కల్, కరూర్, దిండుగల్, తేని, తిరుప్పూర్ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు రాలే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.