బార్‌లో కాల్పులు.. 12 మంది మృతి

ABN , First Publish Date - 2022-10-17T08:58:04+05:30 IST

బార్‌లో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు.

బార్‌లో కాల్పులు.. 12 మంది మృతి

  • మృతుల్లో ఆరుగురు మహిళలు..
  • మెక్సికోలోని ఇరపూటో నగరంలో ఘటన 

మెక్సికో, అక్టోబరు 16: బార్‌లో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. మెక్సికోలోని ఇరపూటో నగరంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. నిందితులను గుర్తించేందుకు భద్రతాదళాలు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. కాల్పులకు కారణం ఇంతవరకు తెలియలేదు. మెక్సికోలో తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లుతోంది. గువానాజువాటో రాష్ట్రంలో నెల వ్యవధిలో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ప్రపంచంలోనే టాప్‌ కార్ల తయారీదారుల్లో అనేకమందికి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అయితే, గత కొన్నేళ్లుగా డ్రగ్స్‌ ముఠాల మధ్య గొడవలతో ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. గతనెల మొదట్లో ఇదే రాష్ట్రంలోని టరిమోరోలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది మరణించారు. అలాగే, ఈనెల 6న గుయెర్రెరో రాష్ట్రంలోని సిటీహాల్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నగర మేయర్‌ సహా 12 మందికిపైగా మరణించారు. 

Updated Date - 2022-10-17T08:58:04+05:30 IST