మంచు తుపాన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు

ABN , First Publish Date - 2022-02-24T14:22:41+05:30 IST

భారీ మంచు కురుస్తున్న కారణంగా సోనామార్గ్‌లో చిక్కుకుపోయిన 50 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు

మంచు తుపాన్‌లో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు

గండేర్‌బల్ (జమ్మూకశ్మీర్): భారీ మంచు కురుస్తున్న కారణంగా సోనామార్గ్‌లో చిక్కుకుపోయిన 50 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సోన్‌మార్గ్‌లో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి చర్యలు తీసుకునేందుకు డీఎస్పీ కంగన్ యాసిర్ ఖాద్రీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని ఎస్పీ గందర్‌బల్ నిఖిల్ బోర్కర్ చెప్పారు.పోలీసులు గగాంగీర్ నుంచి సోనామార్గ్ వరకు పలు వాహనాలను ఏర్పాటు చేసి మంచు తుపానులో చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ తిరిగి గండేర్‌బల్‌కు తీసుకువచ్చారు. భారీ హిమపాతం కారణంగా ప్రధాన రహదారిని బ్లాక్ చేయడంతో పర్యాటకులను నిర్మాణంలో ఉన్న జడ్ మోర్ టన్నెల్ ద్వారా శ్రీనగర్‌కు తరలించారు.


Read more