Chennai: కీచక తండ్రికి 20 ఏళ్ళ జైలు

ABN , First Publish Date - 2022-10-17T18:04:57+05:30 IST

ఈరోడ్‌ జిల్లాలో కుమార్తెను ఐదేళ్లుగా లైంగికంగా వేధించిన కేసులో కన్న తండ్రికి 20 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ జిల్లా మహిళా కోర్టు

Chennai: కీచక తండ్రికి 20 ఏళ్ళ జైలు

చెన్నై/అడయార్‌: ఈరోడ్‌ జిల్లాలో కుమార్తెను ఐదేళ్లుగా లైంగికంగా వేధించిన కేసులో కన్న తండ్రికి 20 యేళ్ళ జైలు శిక్ష విధిస్తూ జిల్లా మహిళా కోర్టు తీర్పునిచ్చింది. ఈరోడ్‌కు చెందిన వ్యక్తి (52) జిరాక్స్‌ షాపు నడుపుతున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిలో ప్లస్‌టూ చదివే కుమార్తెను 2017 నుంచి 2021 వరకు లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక భయపడి బయటకు చెప్పలేదు. అయితే, వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో భరించలేని తల్లికి చెప్పింది. ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2021 సెప్టెంబరు 24న పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ జిల్లా మహిళా కోర్టులో జరిగింది. న్యాయమూర్తి మాలతి సాక్ష్యాధారాలను పరిశీలించి తుది తీర్పును వెలువరించారు. లైంగిక వేధింపులకు గురిచేసినందుకు 20 యేళ్ళ జైలు, హత్యా బెదిరింపులకు రెండేళ్ళ కఠినకారాగార శిక్ష, రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చారు. 

Updated Date - 2022-10-17T18:04:57+05:30 IST