విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం
ABN , First Publish Date - 2022-04-21T02:33:10+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా..

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా పోలీసులు ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి కోటి రూపాయలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. పోలీసు సంక్షేమ నిధిని కూడా రూ.10 నుంచి రూ.15 కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. పంజాబ్ పోలీసులతో డిజిటల్ ప్లాట్‌ఫాం నుంచి ముఖ్యమంత్రి బుధవారంనాడు మాట్లాడుతూ, పంజాబ్ పోలీసుల పనిలో ఎలాంటి జోక్యం ఉండబోదని కూడా హామీ ఇచ్చారు.
ఇటీవల పఠాన్‌కోఠ్‌లో 'తిరంగా యాత్ర' సందర్భంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారంగా ఇస్తామని హామీ ఇచ్చారు. భగవంత్ సింగ్ మాన్ సర్కార్ ఇప్పుడు తాజా ప్రకటనతో ఆ హామీని కూడా అమల్లోకి తెచ్చింది.