Ex Minister Velumani బినామీల సంస్థల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2022-07-09T13:46:58+05:30 IST
అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణికి చెందిన బినామీ కంపెనీల్లో మూడో రోజైన శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు.

అడయార్(చెన్నై), జూలై 8: అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణికి చెందిన బినామీ కంపెనీల్లో మూడో రోజైన శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కోయంబత్తూరు రూరల్ దక్షిణ పార్టీ విభాగం కార్యదర్శి చంద్రశేఖర్ మాజీ మంత్రి వేలుమణికి బలమైన బినామీగా ఉన్నారు. ఈయనకు చెందిన మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు 3రోజుల క్రితం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రెండో రోజు గురువారం అవినాశి రోడ్డు పీలమేడులో చంద్రప్రకాష్ కేసీపీ ఇంజనీయర్స్ అనే సంస్థకు చెందిన కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈయన చంద్రశేఖర్‌కు మంచి స్నేహితుడు. పైగా మాజీ మంత్రి వేలుమణి మరో బినామీగా ఉన్నారు. మరుదమలై ఆడివారం ప్రాంతంలో ఉన్న చంద్రశేఖర్ సోదరుడు సెంథిల్ ప్రభు నివాసంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం కూడా కోవై పీలమేడులోని కేసీపీ సంస్థ, పులియకుళంలో ఉన్న ఆలయం చారిటబుల్ ట్రస్టులో దాదాపు 20 మందికిపైగా అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.