రెచ్చగొట్టొద్దు.. బయట తిరగలేరు

ABN , First Publish Date - 2022-07-17T18:43:39+05:30 IST

అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంను ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆర్‌.బి. ఉదయకుమార్‌ హెచ్చరించారు.

రెచ్చగొట్టొద్దు.. బయట తిరగలేరు

                           - Opsకు మాజీమంత్రి హెచ్చరిక


అడయార్‌(చెన్నై), జూలై 16: అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంను ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆర్‌.బి. ఉదయకుమార్‌ హెచ్చరించారు. రాజకీయాలతో పాటు అన్నాడీఎంకే చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేని కోవై సెల్వరాజ్‌ వంటి వారితో తనపై విమర్శలు చేయిస్తే దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పైగా, ఓపీఎస్‌ గురించి అనేక నిజాలను బహిర్గతం చేయాల్సి వస్తుందని అదే జరిగితే ఓపీఎస్‌ బయట తిరగలేరన్నారు. తాను అక్రమంగా ఆస్తులు సేకరించినట్టు తేలితే ప్రజా జీవితం నుంచి వైదొలుగుతానని,  ఓపీఎస్ కు ఇందుకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. తన నిజాయితీని గుర్తించే దివంగత జయలలిత తనను ప్రోత్సహించారనీ, ఇందులోభాగంగానే 2001లో ఎమ్మెల్యేగా ఎన్నికై అదే యేడాది రెవెన్యూ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఆర్‌.బి.ఉదయకుమార్‌ శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలలో పేర్కొన్నారు.

Read more