Shashikalaకు పార్టీలో చోటు లేదు

ABN , First Publish Date - 2022-06-07T12:34:28+05:30 IST

డబ్బుతో రాజకీయాలను శాసించాలని భావిస్తున్న శశికళకు అన్నాడీఎంకేలో స్థానం లేదని మాజీ మంత్రి డి.జయకుమార్‌ స్పష్టం చేశారు.. ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో షరతులతో

Shashikalaకు పార్టీలో చోటు లేదు

- డబ్బుతో రాజకీయాలను శాసించలేరు

- మాజీ మంత్రి డి. జయకుమార్‌


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 6: డబ్బుతో రాజకీయాలను శాసించాలని భావిస్తున్న శశికళకు అన్నాడీఎంకేలో స్థానం లేదని మాజీ మంత్రి డి.జయకుమార్‌ స్పష్టం చేశారు.. ఎన్నికలకు సంబంధించిన కేసుల్లో షరతులతో కూడిన బెయిలు పొందిన జయకుమార్‌ సోమవారం ఉదయం కోర్టు ఉత్తర్వుల మేరకు  వెప్పేరిలోని గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేను విమర్శించే నైతిక హక్కు శశికళకు లేదని, పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను కూడగట్టుకొని డబ్బుతో ఆమె రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారని, ఇది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. పార్టీకి కార్యకర్తలు వెన్నెముక వంటివారని, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలితలను ఆదర్శంగా తీసుకున్న కోట్లాది మంది కార్యకర్తలతో అన్నాడీఎంకే రోజురోజుకు బలం పుంజుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకే పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ది చేకూరిందని, ముఖ్యంగా పోలీసు శాఖలో జోక్యం కలుగజేసుకోలేదని జయకుమార్‌ విమర్శించారు.

Read more