వచ్చే ఎన్నికల్లో విజయం మాదే

ABN , First Publish Date - 2022-05-21T17:28:11+05:30 IST

రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ముఖ్యమం త్రి, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య జోస్యం చెప్పా రు. తనకు, కాంగ్రెస్‌ పార్టీకి

వచ్చే ఎన్నికల్లో విజయం మాదే

              - ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య 

              - మీరే ముఖ్యమంత్రి అంటూ కార్యకర్తల నినాదాలు


 రాయచూరు(బెంగళూరు): రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ముఖ్యమం త్రి, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య జోస్యం చెప్పా రు. తనకు, కాంగ్రెస్‌ పార్టీకి రంభాపురి జగద్గురువుల ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయన్నారు. అధికార ప్రాప్తి లభిస్తుందని తనను స్వామి ఆశీర్వదించారని సంతోషంగా ప్రకటించుకున్నారు. శుక్రవారం జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరులో జరిగిన సామూహిక వివాహాలకు సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో వివాహాల పేరుతో జరుగుతున్న దుబారాలను నియంత్రించడం అవసరమన్నారు. ఆ దిశగా సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని, ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని సూచించారు. కాగా సిద్దరామయ్య తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, రంభాపురి జగద్గురువుల ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పినప్పుడు మీరే ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బయ్యారు. 

Updated Date - 2022-05-21T17:28:11+05:30 IST