పీఎఫ్ ఐపై ట్రైబ్యునల్ ఏర్పాటు
ABN , First Publish Date - 2022-10-07T08:56:23+05:30 IST
పీఎఫ్ ఐపై ట్రైబ్యునల్ ఏర్పాటు
న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎ్‌ఫఐ)పై నిషేధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేశ్‌శర్మ నేతృత్వంలో ఏకసభ్య ట్రైబ్యునల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. ఉపా చట్టం కింద ఒక సంస్థపై నిషేధం విధించాక సదరు సంస్థ వివరణ కోరాలి. ఇందుకోసం ఉపా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలి. ఈ క్రమంలోనే కేంద్రం జస్టిస్ దినేశ్‌శర్మ ట్రైబ్యునల్‌ను నియమించింది.