రష్యాను అడ్డుకోవడంలో నాటో ఫెయిల్: టర్కీ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-02-25T23:21:17+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నివారించడంలో నాటోతోపాటు, యూరోపియన్ యూనియన్ కూడా విఫలమైందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ విమర్శించారు. రష్యా దాడిని అడ్డుకునే విషయంలో నాటో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.

రష్యాను అడ్డుకోవడంలో నాటో ఫెయిల్: టర్కీ అధ్యక్షుడు

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నివారించడంలో నాటోతోపాటు, యూరోపియన్ యూనియన్ కూడా విఫలమైందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ విమర్శించారు. రష్యా దాడిని అడ్డుకునే విషయంలో నాటో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు. నాటోలో టర్కీ కూడా ఒక సభ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంశంపై ఎర్డొగాన్, శుక్రవారం మీడియా సంస్థతో మాట్లాడారు. ‘నాటో, యూరోపియన్‌ యూనియన్‌తోపాటు మిత్ర దేశాలు రష్యా విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఉక్రెయిన్‌కు ఉచిత సలహాలిచ్చాయి. ప్రస్తుతం సలహాలు, దాడిని ఖండించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేద’న్నాడు. ఉక్రెయిన్‌లాంటి పరిస్థితి తమకు ఎదురై, ఎవరైనా తమ దేశంపై దాడి చేస్తే మాత్రం ఎస్-400 క్షిపణుల్ని ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమన్నారు.

Updated Date - 2022-02-25T23:21:17+05:30 IST