Mobile gaming app : కోల్‌కతాలో ఆరు చోట్ల ఈడీ సోదాలు... రూ.7 కోట్ల నగదు స్వాధీనం...

ABN , First Publish Date - 2022-09-10T20:30:05+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోల్‌కతాలో ఆరు చోట్ల నిర్వహించిన

Mobile gaming app : కోల్‌కతాలో ఆరు చోట్ల ఈడీ సోదాలు... రూ.7 కోట్ల నగదు స్వాధీనం...

కోల్‌కతా : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోల్‌కతాలో ఆరు చోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7 కోట్ల నగదు బయటపడింది. మొబైల్ గేమింగ్ యాప్ (Mobile gaming app) ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు. 


ఓ వార్తా సంస్థ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈడీ (Enforcement Directorate) అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి కోల్‌కతా, గార్డెన్ రీచ్ ఏరియాలోని నాసిర్ ఖాన్ అనే వ్యాపారవేత్తకు సంబంధించిన ఆరు చోట్ల సోదాలు చేశారు. రూ.7 కోట్ల మేరకు నగదును, ఆస్తి దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త రాసే సమయానికి ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించేందుకు క్యాష్ కౌంటింగ్ మెషిన్లను తీసుకొచ్చారు. 


ఈడీ సోదాలు సజావుగా జరగడం కోసం నాసిర్ ఖాన్ ఇంటి వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు అనుమానించదగిన పరిస్థితులు ఉన్నపుడు ఈడీ సోదాలు చేస్తోంది. 

Read more