జమ్మూకశ్మీరులో మరో Encounter

ABN , First Publish Date - 2022-07-06T12:32:44+05:30 IST

జమ్మూకశ్మీరులో బుధవారం తెల్లవారుజామున మరోసారి ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి....

జమ్మూకశ్మీరులో మరో Encounter

కుల్గాం(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో బుధవారం తెల్లవారుజామున మరోసారి ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. కుల్గామ్‌లోని హడిగాం ప్రాంతంలో  ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయ.బుధవారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని హడిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ప్రస్తుతం హడిగాంలో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. 


Read more