అసెంబ్లీలో Eknath Shinde కంటతడి
ABN , First Publish Date - 2022-07-04T21:45:11+05:30 IST
మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం తొలిసారి ప్రసంగించిన కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే..

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం తొలిసారి ప్రసంగించిన కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భావోద్వేగానికి గురయ్యారు. తిరుగుబాటు సమయంలో తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ...గతంలో చనిపోయిన తన ఇద్దరు పిల్లలను తలుచుకుని కంటతడి పెట్టారు.
''వాళ్లు మా కుటంబంపై దాడి చేశారు...మా నాన్నగారు ఇంకా బతికే ఉన్నారు. అమ్మ చనిపోయింది. నా తల్లిదండ్రులకు సరైన సమయం కేటాయించలేకపోయాను. వాళ్లు నేను ఇంటికి వచ్చాక పడుకునే వారు. నేను పడుకున్న తరువాత పనికి వెళ్లేవారు. నా కుమారుడు శ్రీకాంత్‌కు కూడా సరైన సమయం వెచ్చించలేకపోయే వాడిని. నా ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే (శివసేన సీనియర్ నేత) నన్ను ఓదార్చేవారు. ఎవరి కోసం బతకాలని ఆ సమయంలో నాకు అనిపించేది'' అని షిండే అన్నారు. ఆనంద్ డిఘే తనను ఓదార్చి, కళ్లు తుడుచుకొమ్మని, ఇతరుల కన్నీళ్లు కూడా నువ్వు తుడవాలని తనతో చెప్పేవారని, ఆయన తనను కోలుకునేలా చేయడంతో పాటు అసెంబ్లీలో శివసేన నేతగా కూడా చేశారని షిండే గుర్తుచేసుకున్నారు.