Delhi Deputy CM ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-10-07T17:07:40+05:30 IST

ఢిల్లీ డిప్యూటీ సీఎం (Delhi Deputy CM) సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు (ED raids) నిర్వహిస్తోంది.

Delhi Deputy CM ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు

ఢిల్లీ : ఢిల్లీ డిప్యూటీ సీఎం (Delhi Deputy CM) సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు (ED raids) నిర్వహిస్తోంది. దినేష్ అరోరా ఇల్లు, ఆఫీసుతో పాటు స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. దినేష్‌ అరోరా (Dinesh Arora)కు చెందిన అకౌంట్‌లోకి రూ. కోటి నగదు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. రాధాకృష్ణ ఇండస్ట్రీస్ ద్వారా దినేష్‌ అరోరా యూకో బ్యాంక్‌ (Uco Bank)లోకి నగదు బదిలీ అయినట్టు గుర్తించారు. సమీర్‌ మహేంద్రు రూ. కోటి బదిలీ చేసినట్టు తేలింది. ఇప్పటికే దినేష్ అరోరాపై సీబీఐ కేసు నమోదు చేసింది. దినేష్ అరోరా డబ్బులు మనీష్‌ సిసోడియాకు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. సమీర్‌ మహేంద్రు, అర్జున్‌ పాండే, విజయ్‌ నాయర్‌, రామచంద్రపిళ్లైలకు రూ. 5 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ కస్టడీలో ఉన్న సమీర్‌ మహేంద్రు స్టేట్‌మెంట్‌తో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో రెండు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహించనుంది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లలో సుమారు 35 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ తెల్లవారు జాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాల వెల్లడించాయి.


Updated Date - 2022-10-07T17:07:40+05:30 IST