Punjab భటిండా ప్రాంతంలో భూకంపం
ABN , First Publish Date - 2022-03-18T15:24:49+05:30 IST
పంజాబ్ రాష్ట్రంలోని భటిండా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది...

భటిండా(పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని భటిండా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. భటిండా పట్టణానికి 231 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం ఉదయం 8.24 గంటలకు సంభవించిన భూకంపం 92 కిలోమీటర్ల లోతులో నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.