Breaking News : మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మరికాసేపట్లో
ABN , First Publish Date - 2022-06-30T21:25:43+05:30 IST
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత

ముంబై : మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. షిండే గురువారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన నివాసంలో కలిశారు. మరికొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ వివరాలను జాతీయ మీడియా తెలిపింది.
దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే గురువారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీని రాజ్‌భవన్‌లో కలుస్తారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడతారు.
ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబై చేరుకుని, దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌తో వీరిద్దరూ సమావేశమైనపుడు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పిస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతారు.