Ice cream ఆర్డరు చేస్తే Condom ప్యాకెట్ల డెలివరీ

ABN , First Publish Date - 2022-08-29T16:55:02+05:30 IST

ఐస్‌క్రీమ్‌ ఆర్డరు చేస్తే కండోమ్‌ ప్యాకెట్లు డెలివరీ చేసిన ఘటన కోయంబత్తూర్‌లో జరిగింది. కోవైకు చెందిన పెరియస్వామి తమ పిల్లల

Ice cream ఆర్డరు చేస్తే Condom ప్యాకెట్ల డెలివరీ

చెన్నై/పెరంబూర్‌: ఐస్‌క్రీమ్‌(Ice cream) ఆర్డరు చేస్తే కండోమ్‌(Condom) ప్యాకెట్లు డెలివరీ చేసిన ఘటన కోయంబత్తూర్‌లో జరిగింది. కోవైకు చెందిన పెరియస్వామి తమ పిల్లల కోసం ‘స్విగ్గీ’ యాప్‌ ద్వారా ఐస్‌క్రీమ్‌, చిప్స్‌ కోసం ఆర్డరు చేశాడు. సదరు సంస్థ ఉద్యోగి అందజేసి వెళ్లిన ప్యాకెట్లు పరిశీలించిన పెరియస్వామి దిగ్ర్భాంతి చెందాడు. అందులో ఐస్‌క్రీమ్‌కు బదులుగా రెండు కండోమ్‌ ప్యాకెట్లు ఉండడంతో, ఈ విషయాన్ని ఆయన తన యాప్‌ ద్వారా స్విగ్గీ సంస్థకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు పెరియస్వామికి క్షమాపణలు తెలిపిన సంస్థ యాజమాన్యం, ఐస్‌క్రీమ్‌, చిప్స్‌ ప్యాకెట్లు అందజేసి, కండోమ్‌ ప్యాకెట్లు తీసుకెళ్లింది.

Updated Date - 2022-08-29T16:55:02+05:30 IST