Mask mandatory in Delhi : ఢిల్లీలో మాస్క్ తప్పనిసరి.. లేదంటే రూ.500 ఫైన్.. ప్రభుత్వ ఆదేశాలు
ABN , First Publish Date - 2022-08-11T21:28:00+05:30 IST
కరోనా(corona) కేసుల పెరుగుదల, సీజనల్ వ్యాధుల(seasonal diseases) వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) కీలకమైన నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ : కరోనా(corona) కేసుల పెరుగుదల, సీజనల్ వ్యాధుల(seasonal diseases) వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో మాస్క్‌ను(Mask) తప్పనిసరి చేస్తూ డీడీఎంఏ (DDMA) (డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత కార్లలో మినహా ప్రతి చోటా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, ప్రైవేటు వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని హెచ్చరించింది.
మాస్క్ నిబంధన ఉల్లంఘించినవారిపై రూ.500 జరిమానా విధించనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని డీడీఏఎం స్పష్టం చేసింది. మాస్క్ ధరించే విషయంలో జనాలు నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తించిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో జరిగిన మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను జిల్లా పాలనా యంత్రాంగాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.