దేశంలో కరోనా తగ్గుముఖం...కొత్తగా 58,077 కేసులు

ABN , First Publish Date - 2022-02-11T16:07:18+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కొత్త కేసులు నమోదు అవగా... 657 మరణాలు సంభవించారు

దేశంలో కరోనా తగ్గుముఖం...కొత్తగా 58,077 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య  తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా  58,077 కొత్త కేసులు నమోదు అవగా... 657 మరణాలు సంభవించాయి. అలాగే  1,50,407 రికవరీ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 171.79 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ జరిగాయి. దేశంలో ప్రస్తుతం 6,97,802 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు శాతం 1.64%, రికవరీ రేటు ప్రస్తుతం 97.17%గా ఉంది. అలాగే రోజువారీ సానుకూలత రేటు 3.89%, వారంవారీ సానుకూలత రేటు 5.76%గా నమోదు అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం 74.78 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 14,91,678 పరీక్షలు నిర్వహించారు. 

Updated Date - 2022-02-11T16:07:18+05:30 IST