Akasa flight: ఢిల్లీ వెళ్తున్న ఆకాశ విమానాన్ని ఢీకొన్న పక్షి.. తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2022-10-27T15:45:55+05:30 IST

ఢిల్లీ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆకాశ ఎయిర్‌(Akasa flight)కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8

Akasa flight: ఢిల్లీ వెళ్తున్న ఆకాశ విమానాన్ని ఢీకొన్న పక్షి.. తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: ఢిల్లీ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆకాశ ఎయిర్‌(Akasa flight)కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం గురువారం ఉదయం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరింది. విమానం 1900 అడుగులో ఎత్తులో ఉండగా ఓ పక్షి ఢీకొంది. ఈ ఘటనలో విమానం ముందు భాగం (నోస్) సొట్టబడింది. అయితే, అంతకుమించి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

విమానాన్ని పక్షి డీకొన్న విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్ధారించింది. ఆకాశ బి-737-8 (మ్యాక్స్) విమానాన్ని ఈ రోజు (గురువారం) పక్షి ఢీకొట్టిందని, 1900 అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగిందని పేర్కొంది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత విమానం ముక్కు భాగం బాగా దెబ్బతిన్న విషయాన్ని గుర్తించినట్టు తెలిపింది. విమానం టేకాఫ్ కావడానికి అవకాశం లేనంతగా దెబ్బతిన్నట్టు వివరించింది.

ఈ ఘటనపై ఆకాశ ఎయిర్ (Akasa Air) కూడా స్పందించింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1333ని పక్షి ఢీకొట్టినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. విమానం ఢిల్లీలో క్షేమంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. విమానాన్ని క్షుణ్ణంగా పరీశీలించేందుకు నిలిపివేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఆకాశ ఎయిర్ సేవలు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యాయి.

Updated Date - 2022-10-27T15:45:57+05:30 IST