ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది: రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2022-02-24T23:36:37+05:30 IST

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని, యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదన్నారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ నేడు కేంద్ర కేబినెట్‌తో అత్యవసర సమావేశం జరపబోతున్నారు. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చే విషయంపై చర్చించే అవకాశం ఉంది. 

Read more