వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-07-18T18:01:23+05:30 IST

నీలగిరి జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. బెంగళూరులోని ఐటీ కంపెనీకి

వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం లభ్యం

చెన్నై/పెరంబూర్‌: నీలగిరి జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. బెంగళూరులోని ఐటీ కంపెనీకి చెందిన  10 మంది ఉద్యోగులు విహారయాత్రకు వచ్చి నీలగిరి జిల్లా ఉదగై నగర్‌ సమీపంలోని ఓ విడిది గృహంలో బసచేశారు. వీరిలో వినీత చౌదరి అనే మహిళా ఉద్యోగి శనివారం సాయంత్రం కల్లకుట్టి నది వద్దకు వెళ్లిన సమయంలో వరద ఉధృతికి గల్లంతైంది. ఈ విషయం తెలుసుకున్న విపత్తుల నివారణ బృందం సభ్యులు, గూడలూరు పోలీసులు ఆమె జాడ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం ఆమె మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Read more