Delhi: డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నివాసంపై దాడి

ABN , First Publish Date - 2022-10-17T20:06:11+05:30 IST

ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇంటిపై సోమవారంనాడు ..

Delhi: డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నివాసంపై దాడి

న్యూఢిల్లీ: ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ (Delhi commission for Women) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ (Swati malival) ఇంటిపై సోమవారంనాడు కొందరు అగంతకులు దాడి (Attack) చేసి, ఆమె తల్లి కార్లను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మలివాల్ ఒక ట్వీట్‌లో తెలియజేశారు. కొందరు వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారని, తన నివాసం వద్ద పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారని చెప్పారు. తన తల్లి ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. తన ట్వీట్‌ను ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు.


కాగా, డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ ఇంటిపై దాడి జరగడానికి కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన మిరిండా హౌస్ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఒక ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ఈ దాడి  ఘటన చోటుచేసుకుంది. క్యాంపస్‌లో దీపావళి పండుగను చూసేందుకు కొందరు యువకులు కళాశాల గోడలు ఎక్కి సెక్సియస్ట్ నినాదాలు చేశారనే ఆరోపణలపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం  చేసింది. నగర పోలీసులకు, ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్‌కు నోటీసులు జారీ చేసింది. ఫెస్టివల్ సమయంలో కళాశాల ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను సైతం స్వాతి మలివాల్ ప్రశ్నించారు.


కాగా, కొద్దిరోజుల క్రితమే రియాలిటీ షో బిగ్ బాస్ నుంచి నిర్మాత సాజిద్ ఖాన్‌ను తొలగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన కారణంగా తనను రేప్ చేస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బెదరింపులు వస్తున్నాయని స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు సమర్పించారు. బెదరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు.

Updated Date - 2022-10-17T20:06:11+05:30 IST