Bullet Train : బుల్లెట్‌ రైలు కోసం 22వేల చెట్ల నరికివేత

ABN , First Publish Date - 2022-12-10T01:17:37+05:30 IST

ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణానికి మార్గం సుగమమయింది. ఇందుకోసం మడ అడవుల్లోని 22వేల చెట్లను నరికివేయడానికి శుక్రవారం బాంబే

Bullet Train : బుల్లెట్‌ రైలు కోసం 22వేల చెట్ల నరికివేత

అన్ని మడ అడవుల్లోనివే.. బాంబే హైకోర్టు అనుమతి

అయిదు రెట్లు అదనంగా మొక్కలు నాటాలని షరతు

ముంబయి, డిసెంబరు 9: ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణానికి మార్గం సుగమమయింది. ఇందుకోసం మడ అడవుల్లోని 22వేల చెట్లను నరికివేయడానికి శుక్రవారం బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. మిగిలిన అన్ని అనుమతులు లభించాయని, ఒక్క చెట్ల తొలగింపుపైనే అంగీకారం రావాల్సి ఉందని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. తొలుత 53,467 చెట్లను తొలగించాలని అనుకున్నప్పటికీ దాన్ని సుమారు 22వేలకు పరిమితం చేసినట్టు తెలిపింది. ఇందుకు కోర్టు ఆమోదం తెలిపింది. అయితే తొలగించిన చెట్లకు అయిదు రెట్లు అదనంగా కొత్త మొక్కలు నాటాలన్న షరతును అమలు చేయాలని సూచించింది.

Updated Date - 2022-12-10T11:19:36+05:30 IST