ఇది ఉక్రెయిన్‌పై దాడి కాదు, మమ్మల్ని మేం కాపాడుకోవడమే : రష్యా

ABN , First Publish Date - 2022-02-24T21:16:12+05:30 IST

ప్రస్తుత పరిణామాలు ఉక్రెయిన్‌పై కానీ, ఉక్రెయిన్ ప్రజలపై

ఇది ఉక్రెయిన్‌పై దాడి కాదు, మమ్మల్ని మేం కాపాడుకోవడమే : రష్యా

మాస్కో : ప్రస్తుత పరిణామాలు ఉక్రెయిన్‌పై కానీ, ఉక్రెయిన్ ప్రజలపై కానీ దాడి చేయాలనే కోరికకు సంబంధించినవి కాదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌ను నిర్బంధించినవారు దానిని తమ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల నుంచి రష్యాను కాపాడుకోవడానికి సంబంధించనవే ఈ పరిణామాలని తెలిపారు. 


యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR) ఏర్పడినపుడు కానీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కానీ, నేడు ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలు ఏ విధంగా తమ జీవితాలను నిర్మించుకోవాలనుకుంటున్నారో వారిని అడగలేదన్నారు. నేడు ఉక్రెయిన్‌లో జీవిస్తున్న ప్రజలు, ఈ పని చేయాలని కోరుకునే ఎవరైనా, స్వేచ్ఛాయుతంగా ఎంపిక చేసుకునే హక్కును తప్పనిసరిగా వినియోగించుకోగలగాలని చెప్పారు. 


ఉక్రెయిన్‌పై గురువారం ఉదయం రష్యా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను, విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 


Read more