Crocodile: మొసళ్ల పార్కులో ‘సూపర్‌స్టార్ అలీ’ మృతి
ABN , First Publish Date - 2022-12-31T09:03:00+05:30 IST
చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా మహాబలిపురం సమీపం వడనెమ్మేలి వద్దనున్న మొసళ్ళ పార్కులో పద్నాలు
చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా మహాబలిపురం సమీపం వడనెమ్మేలి వద్దనున్న మొసళ్ళ పార్కులో పద్నాలుగేళ్ల పాటు చిన్నారులకు ఆకట్టుకున్న ‘సూపర్‌స్టార్ అలీ’ అనే మొసలి(Crocodile) గురువారం సాయంత్రం ఆకస్మికంగా మృతిచెందింది. మొసళ్లపార్కు సిబ్బంది ఆంగ్లంలో చెప్పేవి తుచ తప్పకుండా పాటించి సందర్శకులను ఈ మొసలి ఆకట్టుకునేది. అమెరికా జాతికి చెందిన ఈ మొసలి మృతి పట్ల పార్కు నిర్వాహకులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.