వంతెనల రెయిలింగుల స్థానంలో క్రాష్‌ బారియర్స్‌

ABN , First Publish Date - 2022-12-16T00:59:55+05:30 IST

దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వంతెనల రెయిలింగుల స్థానంలో క్రాష్‌ బారియర్స్‌ (కాంక్రీట్‌ లేదా ఉక్కు రేకులకు ప్రత్యామ్నాయంగా రూపొందించినవి)

వంతెనల రెయిలింగుల స్థానంలో క్రాష్‌ బారియర్స్‌

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబరు 15: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వంతెనల రెయిలింగుల స్థానంలో క్రాష్‌ బారియర్స్‌ (కాంక్రీట్‌ లేదా ఉక్కు రేకులకు ప్రత్యామ్నాయంగా రూపొందించినవి) ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలోని రెండు, నాలుగు, ఆరు వరుసల రహదారులపై ఇప్పటికే ఉన్న, కొత్తగా నిర్మించే వంతెనలపై ఈ క్రాష్‌ బారియర్స్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటి వల్ల ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఢీ కొనగానే క్రాష్‌ బారియర్‌ వాహనాన్ని వెనక్కి నెడుతుంది. దీని వల్ల వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

Updated Date - 2022-12-16T00:59:56+05:30 IST