పక్కలో బల్లెమయ్యారు...!

ABN , First Publish Date - 2022-03-05T15:50:51+05:30 IST

కూటమిలో భాగస్వాములంటూ పదవులు ప్రకటించారు.. అంతలోనే పక్కలో బల్లెంలా తయారై ఆ పదవులను తన్నుకు పోయారు. దీంతో బిత్తరపోవడం డీఎంకే కూటమి లోని పార్టీల వంతయింది. ఇందుకు తలెత్తి,

పక్కలో బల్లెమయ్యారు...!

                 - సీపీఎం స్థానాన్ని కైవసం చేసుకున్న డీఎంకే


ప్యారీస్‌(చెన్నై): కూటమిలో భాగస్వాములంటూ పదవులు ప్రకటించారు.. అంతలోనే పక్కలో బల్లెంలా తయారై ఆ పదవులను తన్నుకు పోయారు. దీంతో బిత్తరపోవడం డీఎంకే కూటమిలోని పార్టీల వంతయింది. ఇందుకు తలెత్తి, తిరుప్పూర్‌, తేని జిల్లాలు వేదికలయ్యాయి..


తిరుప్పూర్‌ జిల్లా...: తిరుప్పూర్‌ జిల్లా అవినాశి సమీపంలోని తిరుమురుగన్‌పూండి పట్టణ పంచాయతీ చైర్మన్‌ సీటును కూటమికి నేతృత్వం వహిస్తున్న డీఎంకే, సీపీఎంకు కేటాయించింది. ఈ నగర పంచాయతీలో మొత్తం 27 వార్డుల్లో డీఎంకే 9, సీపీఎం 5, సీపీఐ 3, అన్నాడీఎంకే 9 వార్డుల్లో విజయం సాధించాయి. డీఎంకే అధిష్ఠానం ఈ పంచాయతీ ఛైర్మన్‌ పదవిని సీపీఎంకు కేటాయిం చడంతో 10వ వార్డులో గెలుపొందిన సుబ్రమణ్యంను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం జరిగిన పరోక్ష ఎన్నికల్లో డీఎంకే తరఫున 26వ వార్డులో గెలిచిన కుమార్‌, సీపీఎం అభ్యర్థికి వ్యతిరేకంగా ఛైర్మన్‌ ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ వేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్ని కల్లో సుబ్రమణ్యంకు 12 ఓట్లు రాగా, 15 ఓట్లు పొంది డీఎంకే అభ్యర్థి కుమార్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.


గాంగేయం....

గాంగేయం నగర పంచాయతీ ఛైర్మెన్‌ పదవికి కాంగ్రెస్‌ తరఫున 10వ వార్డు కౌన్సిలర్‌ హేమలతను డీఎంకే ప్రకటించింది. అయితే, 1వ వార్డు డీఎంకే కౌన్సిలర్‌ సూర్యప్రకాష్‌ శుక్రవారం జరిగిన ఛైర్మన్‌ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించి పోటీచేసి, తమ మద్దతు కౌన్సిలర్ల సహకారంతో ఆ సీటు గెలుచుకున్నారు.


తేని జిల్లా...: తేని జిల్లా అల్లినగర్‌ నగర పంచాయతీ చైర్మన్‌ పదవి డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు కేటాయించిన నేపథ్యంలో, అక్కడ డీఎంకే కౌన్సిలర్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో డీఎంకే 19, అన్నాడీఎంకే 7, ఏఎంఎంకే, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్లు తలా రెండు వార్డులు, బీజేపీ ఒక వార్డులో గెలిచాయి. 22వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సర్గుణం చైర్మన్‌ పదవికి నామినేషన్‌ వేయగా, ఆయనకు వ్యతిరేకంగా 10వ వార్డు డీఎంకే కౌన్సిలర్‌ రేణుప్రియ పోటీచేసి చైర్మన్‌ పదవిని దక్కించుకున్నారు.

Read more