Covid: 2032 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-08-13T17:41:01+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజువారి పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 2032 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో

బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజువారి పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 2032 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1202 మందికి వైరస్ సోకగా మైసూరు(Mysore)లో 132, హాసన్ 77, ధారవాడ 75, బళ్ళారి 63, బెంగళూరు గ్రామీణ 60 మం దికి వైరస్ ప్రబలింది. 23 జిల్లాలో 50లోపు కేసులు నమోదు కాగా బీదర్(Bidar) జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 1686 మంది కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో ఐదుగురు మృతిచెందారు. 10395 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరు 7102 మంది ఉన్నారు.