కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజులపాటు సెలవు

ABN , First Publish Date - 2022-02-01T13:49:22+05:30 IST

ఒడిశాలోని ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడితే ఒక వారం పాటు సెలవు తీసుకోవచ్చని రాష్ట్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది...

కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజులపాటు సెలవు

భువనేశ్వర్: ఒడిశాలోని ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడితే ఒక వారం పాటు సెలవు తీసుకోవచ్చని రాష్ట్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది.మెడికల్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత వ్యవధిని పొడిగించవచ్చని ఒడిశా సర్కారు పేర్కొంది.ప్రస్తుతం మూడవ కొవిడ్ వేవ్ ఉన్న పరిస్థితిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లయితే ఏడు రోజుల సెలవును అనుమతించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు వైరస్ పాజిటివ్ అని తేలితే 14 రోజుల సెలవు అనుమతించారు.


Updated Date - 2022-02-01T13:49:22+05:30 IST