కేసులకంటే డిశ్చార్జ్‌లు అధికం
ABN , First Publish Date - 2022-02-10T17:02:14+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. వైద్యఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం పాజిటివ్ కేసులకంటే డిశ్చార్జ్‌లు అధికంగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,33

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. వైద్యఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం పాజిటివ్ కేసులకంటే డిశ్చార్జ్‌లు అధికంగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,339 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 2,161, తుమకూరులో 342, బెళగావిలో 327 మందికి ప్రబలింది. 15 జిల్లాల్లో వందలోపు కేసులు నమోదు కాగా ఇతర జిల్లాల్లో 100-200లోపు కేసులు నమోదయ్యాయి. 16,749 మంది డిశ్చార్జ్ కాగా 48మంది మృతిచెందారు. బెంగళూరులోనే 16 మంది ఉన్నారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 60,956మంది చికిత్సలు పొందుతున్నారు.