అన్ని జిల్లాల్లోనూ వందల్లో Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-20T18:01:43+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు అన్ని జిల్లాల్లోనూ వందలసంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40,499 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 24,135 మందికి వైరస్‌ ప్రబలింది.

అన్ని జిల్లాల్లోనూ వందల్లో Covid కేసులు

                        - 23 వేల మంది డిశ్చార్జ్‌


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు అన్ని జిల్లాల్లోనూ వందలసంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 40,499 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 24,135 మందికి వైరస్‌ ప్రబలింది. తుమకూరులో 1804 మందికి, హాసన్‌ 1785, మైసూరు 1341, మండ్య 1340, దక్షిణకన్నడ 983 మందికి వైరస్‌ సోకింది. బాగల్కోటె, హావేరి, యాదగిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లోనూ వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. ఇటీవల పదిరోజులుగా కొవిడ్‌ కేసులు వేలల్లో నమోదవుతుండగా డిశ్చార్జ్‌లు అత్యల్పంగా కొనసాగాయి. అనూహ్యంగా ఒక్కరోజులోనే 23,209 మంది కోలుకోవడం విశేషం. కాగా రెండు మూడు నెలల అవధిలో అత్యధికంగా 21మంది మృతి చెందగా బెంగళూరులో ఐదుగురు, మైసూరులో నలుగురు, దక్షిణకన్నడలో ముగ్గురు, మరో 12 జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. ఇంకా 2,67,650 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-01-20T18:01:43+05:30 IST