యూపీపై కోర్టు ధిక్కరణ కేసు మూసివేత

ABN , First Publish Date - 2022-08-31T09:36:56+05:30 IST

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై పెట్టిన కోర్టు ధిక్కరణ కేసును మంగళవారం సుప్రీంకోర్టు మూసివేసింది. బాబ్రీ మసీదు

యూపీపై కోర్టు ధిక్కరణ కేసు మూసివేత

న్యూఢిల్లీ, ఆగస్టు 30: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై పెట్టిన కోర్టు ధిక్కరణ కేసును మంగళవారం సుప్రీంకోర్టు మూసివేసింది. బాబ్రీ మసీదు విషయమై ఇప్పటికే తీర్పు వెలువడినందున ఇంకా కోర్టు ధిక్కరణ కేసు అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. కట్టడాన్ని పరిరక్షించాలంటూ 1992లో సుప్రీంకోర్టు చేసిన ఆదేశాలను అమలు చేస్తామని అప్పటి యూపీ ప్రభుత్వం తెలిపింది. కానీ అదే ఏడాది అది కూల్చివేతకు గుయింది. దాంతో మహమ్మద్‌ అస్లాం భురే అనే వ్యక్తి ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. 30ఏళ్లుగా కేసు లిస్టు కాకపోవడం, పిటిషనర్‌ 2010లో మరణించడంతో కేసు విచారణకు రాకపోవడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Read more