జాబితాల విడుదలలో పార్టీలు బిజీబిజీ

ABN , First Publish Date - 2022-01-23T02:49:28+05:30 IST

వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, జాబితాల విడుదలలో...

జాబితాల విడుదలలో పార్టీలు బిజీబిజీ

న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, జాబితాల విడుదలలో తలమునకలై ఉన్నాయి. తాజాగా, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీ 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గోవాలో 11 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.


ఇందులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు.. లుయిజినో ఫలెరియో, చర్చిల్ అలెయామో కూడా ఉన్నారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు 18 మందిని టీఎంసీ బరిలోకి దింపింది. కాగా, గోవాలో ప్రచారం చేయనున్న టీఎంసీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ చీఫ్ మమతా బెనర్జీతోపాటు, అభిషేక్ బెనర్జీ పేర్లు కూడా ఉన్నాయి. ఇక, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 


Updated Date - 2022-01-23T02:49:28+05:30 IST