Congress Presidential Elections: కొనసాగుతున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. ఎవరెక్కడ ఓటేశారంటే..
ABN , First Publish Date - 2022-10-17T17:28:05+05:30 IST
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోనియా గాంధీ, ప్రియాంక, మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కును..
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోనియా గాంధీ, ప్రియాంక, మన్మోహన్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బెంగళూరులో తన ఓటు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం బరిలో నిలిచారు. కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌లు.. పోటీ పడుతున్నారు. గాంధీల కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో రేసులో ఉన్న థరూర్ మనసు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. గాంధీల కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జరుగుతున్న పరిణామాలతో రేసులో ఉన్న థరూర్ మనసు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇక, ఎలక్టోరల్ కాలేజీలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు సహా మొత్తం 9 వేల మంది ఈ ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలట్ విధానంలో జరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి. జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో 40 మంది ప్రతినిధులు ఇక్కడే ఓటు వేయనున్నారు.