Alagiri statement: రాజ్‌భవన్‌ రాజకీయ వేదిక కాదు

ABN , First Publish Date - 2022-08-12T12:56:56+05:30 IST

రాజ్‌భవన్‌ రాజకీయాలు మాట్లాడుకొనే వేదిక కాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటి (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri) పేర్కొన్నారు. ధర్మపురి

Alagiri statement: రాజ్‌భవన్‌ రాజకీయ వేదిక కాదు

                                     - టీఎన్‌సీసీ నేత అళగిరి


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 11: రాజ్‌భవన్‌ రాజకీయాలు మాట్లాడుకొనే వేదిక కాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటి (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri) పేర్కొన్నారు. ధర్మపురి జిల్లావ్యాప్తంగా 75వ భారత స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్‌(Congress) శ్రేణులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెన్నాగరం సమీపంలోని పాపార్‌పట్టిలో గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన అళగిరి విలేఖరులతో మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర దినం విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తమ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఆంగ్లేయుల లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్లిన చరిత్ర దేశంలో కాంగ్రెస్ కు మాత్రమే ఉందని అళగిరి తెలిపారు. 

Updated Date - 2022-08-12T12:56:56+05:30 IST