Sonia Gandhi: మళ్లీ కోవిడ్ పాజిటివ్, తిరిగి ఐసొలేషన్లో..
ABN , First Publish Date - 2022-08-13T20:31:23+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరిగి కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్లో..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిరిగి కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు. ''శనివారంనాడు వైద్య పరీక్షల్లో సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు'' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఇవాళ ఒక ట్వీట్లో తెలిపారు. సోనియాగాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా ఈ వారం ప్రారంభంలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
కాగా, గత జూన్ మొదట్లో కూడా సోనియాగాంధీ కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. కోవిడ్ అనంతరం సమస్యల కారణంగా జూన్ 12న శ్రీగంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకుని జూన్ 20న డిశ్చార్జి అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కూడా హాజరయ్యారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనూ ఆమె పాల్గొన్నారు.