ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్న Sonia

ABN , First Publish Date - 2022-06-17T18:38:41+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్ తెలిపారు.

ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్న Sonia

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia gandhi) ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేష్ తెలిపారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. సోనియా ఆరోగ్య పరిస్థితిపై మరింత లోతుగా పర్యవేక్షణ చేస్తూ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుండి విపరీతంగా రక్తస్రావం కావడంతో సోనియా ఈనెల 12న గంగారామ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చేరిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షురాలికి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సోనియాగాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించిన వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అలాగే సోనియాగాంధీ ఇతర పోస్ట్ - కోవిడ్ లక్షణాలకు సంబంధించిన చికిత్స కూడా పొందుతున్నారని జైరామ్ రమేష్ వెల్లడించారు. 

Updated Date - 2022-06-17T18:38:41+05:30 IST