సీఈటీకి హిజాబ్ నిషేధం
ABN , First Publish Date - 2022-05-26T17:01:36+05:30 IST
రాష్ట్రంలో మెడికల్ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ)లకు హిజాబ్‌ను నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార ఈ మేరకు

- ప్రభుత్వం ఉత్తర్వులు
బెంగళూరు: రాష్ట్రంలో మెడికల్ మినహా వృత్తి విద్యాకోర్సుల ఎంపిక కోసం జరిగే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ)లకు హిజాబ్‌ను నిషేధించారు. రాష్ట్ర పరీక్షా ప్రాధికార ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎస్ఎల్సీ, పీయూ పరీక్షల్లో అమలు చేసిన తరహాలోనే హిజాబ్ లేకుండా పరీక్షల్లో పాల్గొనాలని ఆదేశించింది. జూన్ 16 నుంచి మూడు రోజుల పాటు సీఈటీలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షా ప్రాధికార ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలను సీఈటీలోనూ అమలు చేయాలని విద్యాశాఖకు సూచించింది. దీంతో పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు హిజాబ్‌తోపాటు ఏ విధమైన ధార్మిక భావనలు కలిగే దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులను పూర్తిగా నిషేధం ఉంటుందని, గడియారాలు, ఆభరణాలు కూడా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తాగునీరు మినహా మిగిలిన ఎటువంటి వ స్తువులకైనా నిషేధం తప్పదన్నారు.