స్వయంగా వచ్చి పశ్చాత్తాపం ప్రకటించండి

ABN , First Publish Date - 2022-12-07T04:22:48+05:30 IST

స్వయంగా న్యాయస్థానానికి హాజరై పశ్చాత్తాపం ప్రకటించాలని కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిని మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

స్వయంగా వచ్చి పశ్చాత్తాపం ప్రకటించండి

వివేక్‌ అగ్నిహోత్రికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబరు 6: స్వయంగా న్యాయస్థానానికి హాజరై పశ్చాత్తాపం ప్రకటించాలని కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిని మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఎల్గార్‌ పరిషద్‌ కేసులో సామాజిక ఉద్యమకారుడు గౌతమ్‌ నవలఖాను గృహ నిర్బంఽధం నుంచి విడుదల చేస్తూ 2018లో అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ ఇచ్చిన ఆదేశాలను విమర్శిస్తూ వివేక్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఆయనపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదయింది. దీనిపై ఆయన లిఖితపూర్వకంగా క్షమాపణ తెలిపారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌, జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌ల ధర్మాసనం..‘‘కోర్టుకు రావడానికి ఇబ్బందిగా ఉందా? వచ్చే ఏడాది మార్చి 16న స్వయంగా వచ్చి పశ్చాత్తాపం ప్రకటించండి’’ అని ఆదేశించింది.

Updated Date - 2022-12-07T04:23:01+05:30 IST