Coimbatore: కోవైలో విరబూసిన బ్రహ్మ కమలం

ABN , First Publish Date - 2022-08-31T15:59:03+05:30 IST

చలి ప్రదేశాల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మ కమలం ప్రస్తుతం కోయంబత్తూర్‌(Coimbatore) వాసులను ఆకట్టుకుంటోంది. పర్వత ప్రాంతాల్లో

Coimbatore: కోవైలో విరబూసిన బ్రహ్మ కమలం

                      - చూసేందుకు ఎగబడుతున్న జనం


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 30: చలి ప్రదేశాల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మ కమలం ప్రస్తుతం కోయంబత్తూర్‌(Coimbatore) వాసులను ఆకట్టుకుంటోంది. పర్వత ప్రాంతాల్లో ఒకరోజు మాత్రమే విరబూసే బ్రహ్మ కమలం అందాలు వీక్షించేందుకు పర్యాటకులు పోటీపడుతుంటారు. ప్రస్తుతం కేరళ సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూర్‌, తేని జిల్లాల్లో బ్రహ్మ కమలం(Brahma lotus) మొక్కలను భారీగా నాటి, నాటి శ్రద్ధగా పెంచుకుంటున్నారు. కోయంబత్తూర్‌ సెల్వపురం నాడార్‌ వీధిలో కవిన్‌ అనే రైతు ఇంట్లో 12 బ్రహ్మ కమలాలు రాత్రి సమయంలో సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈ విరబూసిన ఈ పుష్పాలను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.  

Updated Date - 2022-08-31T15:59:03+05:30 IST