నేడు Stalinతో యశ్వంత్‌సిన్హా భేటీ

ABN , First Publish Date - 2022-06-30T12:52:07+05:30 IST

ప్రతిపక్షాల తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి దిగిన యశ్వంత్‌సిన్హా గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అన్ని రాజకీయపార్టీల

నేడు Stalinతో యశ్వంత్‌సిన్హా భేటీ

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 29: ప్రతిపక్షాల తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి దిగిన యశ్వంత్‌సిన్హా గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ కానున్నారు. అన్ని రాజకీయపార్టీల నేతల మద్దతు కోరుతూ ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, గురువారం మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న యశ్వంత్‌సిన్హా తేనాంపేటలోని అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం మిత్రపక్షాల నేతలను కూడా యశ్వంత్‌సిన్హా కలుసుకొని మద్దతు కోరనున్నారు. ఇదిలా వుండగా రాష్ట్రంలో డీఎంకేకు అత్యధిక బలమున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-30T12:52:07+05:30 IST