letter: అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అవకాశమివ్వండి
ABN , First Publish Date - 2022-08-12T14:30:05+05:30 IST
రాష్ట్రంలో అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అవకాశమివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)

- ప్రధాని మోదీకి సీఎం లేఖ
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 11: రాష్ట్రంలో అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అవకాశమివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) కోరారు. మహాబలిపురం చెంగల్పట్టులో 44వ చెస్ ఒలంపియాడ్(Chess Olympiad) పోటీలు విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రప్రజలు, రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ విషయమై సీఎం స్టాలిన్ తన ట్విట్టర్లో, ‘‘మీ హృదయపూర్వక ప్రశంసలకు ధన్యవాదాలు. ఆతిథ్యం, ఆత్మగౌరవం రెండూ తమిళుల విడదీయరాని గుణాలు. మరిన్ని అంతర్జాతీయ పోటీలు నిర్వహించేందుకు మాకు అవకాశం ఇవ్వండి’’ అంటూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.